Thursday, June 12, 2025

రెండు వారాల పాటు యాక్షన్ సీక్వెన్స్

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ రాబోతోంది. అయితే, ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్‌ను వేస్తున్నారు. ఈ సెట్ లో రెండు వారాల పాటు యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేస్తారట. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో మెగాస్టార్‌పై ఈ ఫైట్స్ చిత్రీకరిస్తారట. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమా మొత్తంలోనే హైలైట్ అవుతాయట. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, – నయనతారలపై ఫ్యామిలీ సీన్స్‌ను షూట్ చేస్తున్నారట. ఈ సీన్స్‌లో వీరిద్దరి మధ్య కామెడీ ఎపిసోడ్ చాలా బాగుంటుందని, అలాగే సినిమాలో ఈ ఎపిసోడ్ చాలా హైలైట్ అవుతుందని తెలుస్తోంది. సినిమాకు ఇది కీలకమైన షెడ్యూల్ అంటున్నారు.

సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఇందులో శివశంకర వరప్రసాద్ అనే పాత్ర లో కనిపించబోతున్నారు చిరంజీవి. ఇది ఆయన నిజమైన పేరు అనే విషయం తెలిసిందే. ఓవైపు టాకీ పూర్తిచేస్తూనే, మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ (Music sittings) కొనసాగిస్తున్నాడు అనీల్ రావిపూడి. ఇప్పటివరకు చిరంజీవి 3 ట్యూన్స్ ఓకే చేశారట. భీమ్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆమధ్య మాట్లాడుతూ.. ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ కథ తనకు బాగా నచ్చిందని చెప్పారు. అన్నట్టు, అనిల్ రావిపూడి చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ చెబుతూ.. “సినిమాలో ఆయా సన్నివేశాల గురించి అనిల్ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుతున్నాను. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది”అని తెలిపారు. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News