- Advertisement -
ఢిల్లీ: రాష్ట్రాల ఆదాయాలు క్షీణించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు నిధుల పంపిణీ వాటా ప్రకారం జరగడం లేదని అన్నారు. ఢిల్లీలో జిఎస్టి సమావేశంలో భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాల ఆదాయాలు పడిపోకుండా చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని సూచించారు. సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులు దెబ్బతినే ప్రమాదం జరుగుతుందని తెలియజేశారు. దేశ ఆదాయ (National Income) వృద్ధిలో రాష్ట్రాల కృషి గణనీయమని, జిఎస్టి రేట్ల సరళీకరణ, పన్ను భారం తగ్గించడం ఆహ్వానించదగినదే అని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు జాతీయ ఆదాయం తగిన వాటా రావడం లేదని విమర్శించారు. పరిహార సెస్సు కొనసాగించి.. ఆదాయాన్ని పంచాలన్న భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
- Advertisement -