Saturday, July 26, 2025

మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణకు రూ.205 కోట్లు

- Advertisement -
- Advertisement -

మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఎయిర్‌పోర్టు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దాదాపు రూ.205 కోట్ల నిధులు విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి భూములిస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.కోటి 20లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించింది. అలాగే ప్లాట్లకు, ఇళ్లకు సైతం న్యాయమైన పరిహారం చెల్లించేందుకు ప్రతిపాదించడంతో భూ బాధితుల నుంచి సానుకూల స్పందన లభించింది. నెల రోజులుగా భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా జరుగుతుండడంతో ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది.

వరంగల్ నగర అభివృద్ధిలో ఇది ఒక కీలక మైలురాయి: ఎంపి కడియం కావ్య
మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణకు నిధులు విడుదల చేసి సిఎం రేవంత్‌రెడ్డి వరంగల్ ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చారని వరంగల్ ఎంపి డాక్టర్ కడియం కావ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ నగర అభివృద్ధికి దోహదపడే మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసిందని ఆమె పేర్కొన్నారు. విమానాశ్రయ ఏర్పాటుకు సాంకేతిక అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల పరిమితిపై ఇప్పటికే కేంద్రం నుంచి అనుమతి పొందిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం

నిధులు విడుదల చేయడం ద్వారా తన నిబద్ధతను మరోసారి చాటుకుందని ఆమె పేర్కొన్నారు. ఎంతో గొప్ప చారిత్రక ప్రాధాన్యం కలిగిన వరంగల్ నగర అభివృద్ధిలో ఇది ఒక కీలక మైలురాయి ఆమె తెలిపారు. వరంగల్ ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఆకాంక్షలకు ఈ నిర్ణయం ఒక ప్రత్యక్ష సాక్ష్యమని ఆమె పేర్కొన్నారు. కేంద్ర విమానయాన శాఖ రాష్ట్ర ప్రభుత్వ చొరవను దృష్టిలో ఉంచుకొని ఎయిర్‌పోర్టు నిర్మాణ విషయంలో తక్షణ చర్యలు చేపట్టాలని ఎంపి డాక్టర్ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News