Tuesday, September 16, 2025

నారా లోకేష్ మంత్రి పదవికి అనర్హుడు: రవిచంద్ర

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఫీజు రియంబర్స్ మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని వైఎస్ ఆర్ పి రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర డిమాండ్ చేశారు. కూటమి పాలనలో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎపి మంత్రి నారా లోకేష్ మంత్రి పదవికి అనర్హుడని విమర్శించారు. పేదింటి బిడ్డల ఉన్నత చదువుకు కూటమి సర్కారులో (Coalition government) గండి పడిందని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. కొండలా పేరుకుపోయిన బకాయిలతో విద్యారంగం కల్లోలంగా మారిందని, కళాశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలియజేశారు. కోర్టసు పూర్తైనా సర్టిఫికేట్లు చేతికందక విద్యార్థులు సతమతం అవుతున్నారని రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News