తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధ మీడియా సమావేశంలో 2024కు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. మొత్తం 1248 నామినేషన్లను పరిశీలించిన కమిటీ.. విజేతలను ఎంపిక చేసింది. తెలంగాణ యుద్ధ నౌక, దివంగత ఉద్యమ నేత గద్దర్ పేరు మీద.. సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఈ అవార్దులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలిసారి గద్దర్ అవార్డులు అందజేయనున్నారు. ఉత్తమ నటుడిగా అల్లుఅర్జున్, ఉత్తమ చిత్రంగా కల్కి సినిమాను కమిటీ ఎంపిక చేసింది.
తెలంగాణ గద్దర్ అవార్డు విజేతలు(2024)
ఉత్తమ మొదటి చిత్రం కల్కి
ఉత్తమ రెండోవ చిత్రం పోట్టేల్
ఉత్తమ మూడవ చిత్రం లక్కీ భాస్కర్
బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ : 35 చిన్న కథకాదు
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి : నివేదా థామస్ (35 ఇది చిన్న కాదు)
ఉత్తమ దర్శకుడు : నాగ్ అశ్విన్ (కల్కి 2898)
ఉత్తమ సహాయ నటుడు : ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి : శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
ఉత్తమ సంగీత దర్శకుడు : భీమ్స్ సిసిరోలియో (రజాకార్)
ఉత్తమ నేపథ్య గాయకుడు : సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)
ఉత్తమ నేపథ్య గాయని : శ్రేయా ఘోషల్ (పుష్ప 2(చూసేకి..))
ఉత్తమ హాస్యనటులు : సత్య, వెన్నెల కిశోర్ (మత్తువదలరా 2)
ఉత్తమ బాలనటులు : మాస్టర్ అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు), బేబీ హారిక
ఉత్తమ కథా రచయిత : శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత : వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్ (రాజూ యాదవ్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : విశ్వనాథ్‌రెడ్డి (గామి)