Thursday, July 10, 2025

ప్రతి ప్రేక్షకుడిలో స్ఫూర్తినింపే చిత్రం

- Advertisement -
- Advertisement -

5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో భారతదేశంలో జరిగిన కొన్ని చరిత్ర లో రాని నిజ జీవితాల కథనాలతో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ,మలయాళ భాషల్లో వస్తున్న చిత్రం ‘గేమ్ అఫ్ చేంజ్’. (Game of Change) జాతీయ, అంతర్జాతీయ నటీ నటులతో సిద్ధార్థ్ రాజశేఖర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మలయాళ దర్శకుడు సిధిన్ దర్శకత్వంలో సిద్ధార్థ్ రాజశేఖర్, మీనా చాబ్రియా నిర్మించిన అంతర్జాతీయ చిత్రమిది. ఫస్ట్ కమ్యూనిటీ బేస్డ్ మూవీగా తెరకెక్కిన ‘గేమ్ ఆఫ్ ఛేంజ్‘ సినిమా త్వరలో థియేటర్స్‌తో పాటు ఓటీటీలోనూ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ మూవీని మీడియాకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో చిత్ర యూనిట్ పాల్గొని సినిమా విశేషాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత, కథానాయకుడు సిద్ధార్థ్ రాజశేఖర్ మాట్లాడుతూ “భారతదేశ చరిత్రలో కుమార గుప్తుడు నిర్మించిన నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగిన కొన్ని నిజ జీవితాల కథనాలతో ఈ చిత్రం రూపొందించాము. అన్ని వయ సు ప్రేక్షకుల కోసం తెరకెక్కించాము. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనం ఎందుకు జీవితంలో సాధించలేము అనే పట్టుదల మొదలవుతుంది. కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడే మనం జీవితంలో ఎదుగుతామని చెప్పే చిత్రమిది”అని అన్నారు. మరో నిర్మాత మీనా చాబ్రియా మాట్లాడుతూ “ఇండియాలో ఇప్పటివరకు ఎవరూ చేయని సాహసం చేశాం. గేమ్ ఆఫ్ ఛేంజ్ సినిమాకు సీక్వెల్స్ కూడా ఉంటాయి”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News