గణేష్ నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని గణేష్ నిమజ్జనం వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున గణనాథుల నిమజ్జనం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వినాయకుడి నిమజ్జనం వేడుకల సందడి నెలకొంది. ఈ వేడుకలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. అయితే, మీర్‌పేట్ పరిధిలోని న్యూ గాయత్రి నగర్‌లో నిర్వహించిన గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. క్రేన్ పై గణేషుడి ఊరేగింపు నిర్వహించారు భక్తులు. ఈ క్రమంలో ప్రసాద్‌బాబు అనే రిటైర్డ్ ఉద్యోగిని క్రేన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతను ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో క్రేన్ ఆపరేటర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో ఘనంగా ప్రారంభమైన గణేషుడి నిమజ్జనం ఈ ఘటనతో విషాదంగా మారింది.
గణేష్ నిమజ్జనంలో విషాదం.. రిటైర్డ్ ఉద్యోగి మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -