- Advertisement -
మనతెలంగాణ సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఈ నెల 6న వినాయక విగ్రహాల నిమజ్జనం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ రోజు(6 సెప్టెంబర్)న సెలవు రోజుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామక్రిష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. అయితే, ఈ నెల 11న రెండో శనివారం సెలవు రోజును వర్కింగ్ డేగా ప్రకటించారు. 6వ తేదీన సెలవు ప్రకటించినందున.. ఈ రోజుకు ప్రత్యామ్నాయంగా ఈనెల 11న ప్రభుత్వ పనిదినంగా ప్రకటిస్తున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
- Advertisement -