Sunday, September 14, 2025

ఆ మేయర్ అవినీతిపరుడు… కేసుల కోసం పార్టీ మారారు: గంగుల

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: అవినీతి కేసులు తప్పించుకునేందుకు కరీంనగర్ మేయర్ సునీల్ రావు బిజెపిలో చేరారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ మండిపడ్డారు. సునీల్ రావు చేసిన కామెంట్లకు గంగుల రీకౌంటర్ ఇచ్చారు. తమ జోలికి వస్తే ఊరుకోమని సునీల్‌ను హెచ్చరించారు. సునీల్‌కు మేయర్ పదవి ఇవ్వొద్దని గతంలో తాను చెప్పానన్నారు. కరీంనగర్ మేయర్ సునీల్ స్వార్ధపరుడని దుయ్యబట్టారు. అవినీతికి పాల్పడితే తనతో పాటు సునీల్‌పై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ భవిష్యత్ కోసం పార్టీలు మారుతూ తనపై ఆరోపణలు చేయడం సరికాదని గంగుల సూచించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే సునీల్ రావు అవినీతి పాల్పడ్డాడని, కేసులకు భయపడి బిఆర్‌ఎస్ లో చేరారని, ఇప్పుడు బిఆర్‌ఎస్ నుంచి బిజెపిలో చేరారని గంగుల ధ్వజమెత్తారు. అవినీతి చేయడంలో సునీల్‌ను మించిన వారు లేరన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News