Sunday, August 3, 2025

కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు చేపట్టాలి: గంగుల

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల శ్రీవారిని ఎంఎల్ఎ గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టిటిడిలో ప్రసాదాలు నాణ్యతగా ఉన్నాయని, కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి పది ఎకరాలు కేటాయించామని, గత రెండు సంవత్సరాల నుంచి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదన్నారు. త్వరగా ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదనపు ఇఒను గంగుల కోరారు. శ్రీవారి ఆలయ నిర్మాణం విషయంలో చంద్రబాబును కలుస్తామని స్పష్ట చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News