- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎం.టెక్, పిహెచ్‌డి కోర్సుల్లో వచ్చే ఏడాది ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్ 2026) పరీక్షకు సంబంధించినఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల తేదీల్లో మార్పు చోటుచేసుకుంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం సోమవారం (ఆగస్టు 25) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా.. తాజా నిర్ణయం ప్రకారం ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించన్నట్లు ఐఐటీ గువాహటి ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు బుక్‌లెట్‌లోనూ మార్పులు చేసింది. ఆలస్య రుసుంతో అక్టోబర్ 9 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
- Advertisement -