లండన్: ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓడితే జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొవడం ఖాయమని ఇం గ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ అథర్టన్ అభిప్రాయపడ్డాడు. గంభీర్ ప్రధాన కోచ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా టెస్టుల్లో వరుస ఓటములు చవిచూస్తున్న విషయాన్ని గుర్తు చేశాడు. సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్‌కు గురైందన్నాడు. కివీస్‌పై ఇంత పేలవమైన ప్రదర్శన భారత్ ఎప్పుడూ చేయలేదన్నాడు. సొంత గడ్డపై జరిగిన సిరీస్‌లో కివీస్ వంటి జట్టు చేతిలో టీమిండియా క్లీన్‌స్వీప్‌కు గురైతుందని కలలో కూడా ఎవరూ ఊ హించి ఉండరన్నాడు.
ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైందన్నాడు. ఈ సిరీస్‌లో భారత్ 13 తో ఓటమి పాలైన సంగతి మరువకూడదన్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా ఇబ్బందుల్లో ఉందన్నాడు. మూడో టెస్టులో ఓడడంతో భారత్ సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడిందన్నాడు. ఒకవేళ చివరి మ్యాచ్‌లో భా రత్ విజయం సాధించక పోతే సిరీస్ కోల్పోవడం ఖాయమన్నాడు. ఇదే జరిగితే గంభీర్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని అథర్టన్ వివరించా డు.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గంభీర్ బాగానే ప్ర భావం చూపుతున్నా టెస్టులకు వచ్చే సరికి పూర్తిగా తేలిపోతున్నాడన్నాడు. గంభీర్ తీసుకుంటున్న అ ర్థంపర్థం లేని నిర్ణయాలతోనే జట్టుకు ఇలాంటి పరిస్థితి నెలకొందన్నాడు. గంభీర్ కోచ్‌గా పూర్తిగా తేలిపోయాడని, ఒక వేళ ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో టీమిండియా గెలిస్తేనే అతన్ని కొనసాగించే అవకాశాలుంటాయని అథర్టన్ పేర్కొన్నాడు. సిరీస్‌లో భారత్ పరాజయం చవిచూస్తే గంభీర్ పదవి ప్రమాదంలో పడడం తథ్యమని జోస్యం చెప్పాడు.