Friday, July 18, 2025

జడ్డూ పోరాటపటిమ అద్వితీయం: గంభీర్ ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

ఐదు టెస్ట్‌ల సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత్ 1-2 తేడాతో సిరీస్‌లో వెనుకంజలో ఉంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఇక లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ సర్వత్ర ఉత్కంఠభరితంగా సాగింది. అందుకు కారణంగా భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja). ప్రధాన బ్యాట్స్‌మెన్లు అందరూ ఔట్ అయిన వేళ.. తానొక్కడే జట్టును విజయ తీరాలకు చేర్చేందుకు కృషి చేశాడు. 181 బంతులు ఎదురుకొని 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కానీ, ఆఖర్లో సిరాజ్ అనూహ్యరీతిలో ఔట్ కావడంతో ఇంగ్లండ్ మ్యాచ్‌లో విజయం సాధించింది.

అయితే సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే వంటి సీనియర్లు జడేజా (Ravindra Jadeja) ఆట తీరుపై విమర్శలు చేశారు. జడేజా ఇంకాస్త వేగంగా ఆడి ఉంటే ఫలితం వేరేలా ఉందని అన్నారు. అయితే కొందరు మాత్రం జడేజా ఆట తీరును ప్రశంసించారు. తాజాగా జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా జడేజా ఆటను మెచ్చుకున్నారు. లార్డ్స్ టెస్ట్‌లో జడేజా పోరాటపటిమ అద్వితీయం అయిన ఆయన కొనియాడారు. డ్రెస్సింగ్ రూంలో ఇందుకు సంబంధించిన వీడియోని ఇండియన్ క్రికెట్ టీం సోషల్‌మీడియా ద్వారా పంచుకుంది. ఇందులో జడేజాను సిరాజ్ కూడా ప్రశంసించాడు. ‘‘ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్.. ఇలా మూడు విభాగాల్లో జడ్డూ భాయ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. జట్టు కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు. జట్టుకు అవసరమైన ప్రతీసారి బ్యాట్‌తో ఆదుకుంటాడు. క్లిష్ట సమయాల్లో ఇలాంటి ప్లేయర్ అన్ని జట్లలోనూ ఉండడు. అతడు మా జట్టులో ఉండటం మా అదృష్టం’’ అని సిరాజ్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News