ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది మాత్రం పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆడిన 10 మ్యాచుల్లో కేవలం రెండు మ్యాచుల్లోనే విజయం సాధించి.. ప్లేఆఫ్స్ ఆశలను చేజార్చుకుంది. దీంతో చెన్నై అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కనీసం చివరి మ్యాచుల్లో అయినా.. విజయం సాధించి పరువు దక్కించుకోవాలని వాళ్లు కోరుకుంటున్నారు.
అయితే చెన్నై సూపర్ కింగ్స్ అంటే అందరికి గుర్తొచ్చే పేరు ఒకటే.. అది ఎంఎస్ ధోనీ. చెన్నైకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ దానికి కారణం ధోనీనే. అయితే, కొంతమంది మాత్రం ధోనీలో మునుపటి దూకుడైన ఆట లేదని.. ఇకనైనా రిటైర్ అయపోయి.. అయితే తాజాగా ధోనీ, వీడకాలు గురించి భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడారు. ధోనీ వీడుకోలు పలికితే దాని వల్ల సిఎస్‌కెకి వచ్చే లాభ, నష్టాల గురించి ఆలోచించి ఆ తర్వాత నిర్ణణం తీసుకంటాడని గవాస్కర్ అన్నారు.
‘ఏ ఆటగాడు అయినా సరే తన కంటే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు ప్రయోజనం కోసం నిర్ణయాలు తీసుకుంటాడు. ధోనీ ఈ సీజన్‌లో ఆడాలని నిర్ణయించుకోవడం కూడా అందులో భాగమే. చెన్నైకి ఏది మంచిదైతే.. తాను ఆ నిర్ణయమే తీసుకుంటాడు. భవిష్యత్లులోనే ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది సిఎస్‌కెకి మంచిదా? కాదా? అని ఆలోచిస్తాడు తప్పా.. తనకు మంచిదా? కాదా? అని ఆలోచించడు’ అని గవాస్కర్ పేర్కొన్నారు.