- Advertisement -
పాట్నా: దంపతుల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో భర్త నాలుకను భార్య కొరికి మింగేసింది. ఈ సంఘటన బిహార్ రాష్ట్రం గయా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఖిజ్రసరాయ్ ప్రాంతంలో భార్యభర్తలు మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం దంపతులు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో భర్త మీద పడి నాలుకను కొరికి మింగేసింది. వెంటనే భర్తను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రక్తస్రావం ఎక్కువగా మగధ్ వైద్య ఆస్పత్రికి డాక్టర్లు రిఫర్ చేశారు. ఇంత జరిగినా కూడా ఆస్పత్రిలో భర్తపై భార్య ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరు గొడవపడ్డారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -