Monday, July 7, 2025

భువనగిరిలో లింగ నిర్ధారణ పరీక్షల కలకలం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిసిన కూడా కొందరు డబ్బులకు కక్కుర్తి పడి గట్టు చప్పుడు కాకుండా లింగా నిర్ధారణ పరీక్షలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. లింక నిర్ధారణ పరీక్షలలో ఆడపిల్ల అని తేలితే అబార్షన్లు చేస్తున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరి మున్సిపల్ పపట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చట్టవ్యతిరేకమైన లింగ నిర్ధారణ పరీక్షలు చేసి, ఇద్దరు గర్భిణులకు అబార్షన్ చేసిన ఘటన ఎస్ఒటి పోలీసుల తనిఖీలలో బహిర్గతమైంది.

భువనగిరి పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆదివారం అర్ధరాత్రి సోమవారం తెల్లవారుజామున మధ్యరాత్రి రెండు గంటల సమయంలో పట్టణంలోని గాయత్రి హాస్పిటల్ లో అబార్షన్ చేస్తున్నారని పక్కా సమాచారం మేరకు ఎస్ఓటి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణులకు అబార్షన్ చేసి అబ్జర్వేషన్ లో ఉంచారు. దీంతో ఆసుపత్రికి చెందిన సిబ్బంది హీరేకర్ శివ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు పట్టణ పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News