Wednesday, July 16, 2025

పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంలో రేవంత్ రెడ్డి ముందున్నారు: శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జీవశాస్త్రాల అభివృద్ధికి అవసరమైన ఎకోసిస్టమ్ హైదరాబాద్ లో ఉంది అని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) తెలిపారు. జీనోమ్ వ్యాలీ ఆసియా ఖండంలోనే ప్రత్యేకమైందిగా గుర్తింపు పొందింది అని అన్నారు. శామీర్ పేటలో జినోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజికల్ కొత్త యూనిట్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంలో సిఎం రేవంత్ రెడ్డి ముందున్నారని, మంచిగా ఉన్న ఏ విధానాన్నీ తాము అధికారంలోకి వచ్చాక మార్చలేదని తెలియజేశారు.

రాష్ట్రాభివృద్ధికి మంచి విధానాలను కొనసాగించామని, 23 శాతం సిఎజిఆర్ ను తెలంగాణ నమోదు చేస్తోందని చెప్పారు. హైదరాబాద్ ను గ్లోబల్ సైన్స్ హబ్ గా (global science hub) మార్చేందుకు కృషి చేస్తున్నామని, సిబిఆర్ఈ ర్యాకింగ్ లో హైదరాబాద్ చోటు దక్కించుకుందని కొనియాడారు. బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాల సరసన హైదరాబాద్ చేరిందని అన్నారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News