టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సినిమా కోసం అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా తర్వాత ఆమె మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. అయితే త్వరలోనే ఆమె వెండితెరపై సందడి చేయనున్నారు. ‘ఘాటి’ (Ghaati) అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతీ అప్‌డేట్ అంచనాలను పెంచేశాయి. గంజాయి స్మగ్లింగ్ చుట్టు సాగే కథ ఇది అని సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్‌లోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సిని (Ghaati) సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా 2 గంటల 37 నిమిషాల నిడివి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో ఏడుకు పైగా భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని.. అందులో అనుష్క ఇరగదీసిందని చెప్తున్నారు. సినిమాకు ఇవే బలం అంటూ సమాచారం. థియేటర్‌లో ఈ సన్నివేశాలను ఆడియన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించారు. విద్యాసాగర్ సంగీతం అందించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి.
Aslo Read : ఓ సైలెంట్ ప్రేమ కథ.. ‘మోగ్లీ’ ప్రపంచాన్ని చూసేయండి..