Friday, September 5, 2025

అదరగొట్టిన ‘ఘాటీ’ రిలీజ్ గ్లింప్స్..

- Advertisement -
- Advertisement -

క్వీన్ అనుష్క శెట్టి, విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ డ్రామా ‘ఘాటి’. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సమర్పిస్తోంది. శుక్రవారం విడుదలకానున్న ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు. అనుష్క శెట్టి శీలావతి పాత్రలో అదరగొట్టారు. ఘాటీ సమాజం ఎదురుకుంటున్న పరిస్థితులకు ఎదురుతిరిగి ఆమె చేసిన పోరాటం గూస్‌బంప్స్ తెప్పించింది. దర్శకుడు క్రిష్ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఇంటెన్స్, ఎమోషన్ రెండింటిని అద్భుతంగా బ్యాలెన్స్ చేసి సినిమాను తీర్చిదిద్దారు. విద్యాసాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ లెవెల్‌లో ఉంది.

అనుష్క నటన ప్రతి ఫ్రేమ్‌లో అద్భుతంగా వుంది. విక్రమ్ ప్రభు కూడా ఇంటెన్స్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం రాజా సాబ్. అయితే రాజా సాబ్… నైజాం మార్కెట్ డీల్ పూర్తయినట్టు తెలిసింది. ఈ సినిమాని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి డిస్ట్రిబ్యూషన్ వారు భారీ మొత్తంతో డీల్ ని పూర్తి చేసినట్టు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News