క్వీన్ అనుష్క శెట్టి యాక్షన్ డ్రామా ‘ఘాటీ’. విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నటుడు విక్రమ్ ప్రభు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “డైరెక్టర్ క్రిష్‌ని చూసి నేను ఈ సినిమాకు ఓకే చెప్పా. ఆయన నన్ను కలిసి కథ చెప్పినప్పుడు చాలా ఆసక్తిగా అనిపించింది. నా గత సినిమాల్లోని చాలా సీన్స్ గురించి చెబుతూ.. ‘నిన్ను దృష్టిలో పెట్టుకునే ‘దేశిరాజు’ క్యారెక్టర్ రాశాను’అని చెప్పారు. ఆ మాట నాకెంతో సంతోషాన్నిచ్చింది.
స్క్రిప్ట్ చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ‘ఘాటీ’ వరల్డ్ ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉంటుంది. ఇందులో నా ఫేవరెట్ యాక్టర్ అనుష్క ఉండడం నాకు హ్యాపీగా అనిపించింది. అనుష్క తన కళ్లతోనే అన్ని హావభావాలూ పలికించగలరు. క్రిష్ డైరెక్షన్లో పని చేయడం గొప్ప అనుభవాన్నిచ్చింది. సినిమాలోని ప్రతి సీన్ కూడా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా తీశారు. అనుష్కతో పాటు మిగతా నటీనటులంతా స్క్రిప్ట్‌లో ఉన్నది ఉన్నట్లు చేశారు. మిగతా సినిమాల్లో కంటే ఇందులో ఫైట్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇందులో నా పాత్ర దేశిరాజు మాట్లాడే భాష ఛాలెంజింగ్‌గా అనిపించింది”అని అన్నారు.
Also Read : ఫ్లాష్‌బ్యాక్‌లో మాఫియా నేపథ్యంలో