భారత ప్రధాని మోడీకి ఘనా దేశపు అత్యున్నత పౌర పురస్కారం అందించారు. ఘనా దేశపు నక్షత్ర స్థాయి గౌరవ హోదాను ప్రధాని మోడీ విశిష్ట రాజనీతిజ్ఞత , ప్రపంచ స్థాయిలో ఆయన నాయకత్వానికి ఉన్న గుర్తింపు క్రమంలో ఈ పురస్కారం ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రెసిడెంట్ నుంచి ఆయన ఈ గౌరవం స్వీకరించారు. ఈ గౌరవం తనకు సవినయపూర్వక గర్వకారణం అని, దీనిని స్వీకరిస్తున్నానని మోడీ తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఈ స్టార్ అవార్డును అందుకుంటున్నట్లు తెలిపారు. ఇరుదేశాల యువత ఉజ్వల భవితకు వారి ఆకాంక్షలకు దీనిని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గౌరవంతో తన బాధ్యత పెరిగిందన్నారు. మరింత బలోపేత ఇండియా ఘనా బంధం కోసం అంకిత భావంతో ముందుకు సాగుతానని వెల్లడించారు. ఘనా ప్రజానీకానికి, వారి ఆదరణకు, ఇక్కడి ప్రభుత్వానికి తన కృతజ్ఞతలు అని చెప్పారు. ఘనా విశిష్ట పురస్కారం ఇంతకు ముందు క్వీన్ ఎలిజబెత్, నెల్సన్ మండేలా, కోఫి అన్నన్ , కింగ్ ఛార్లెస్ 3 వంటి వారికి దక్కింది.
ప్రధాని మోడీకి ఘనా అత్యున్నత పౌర పురస్కారం
- Advertisement -
- Advertisement -
- Advertisement -