నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న సినిమా ‘ఘటికాచలం‘. (Ghatikachalam)ఈ చిత్రానికి కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ ఎం.సి.రాజు. ‘ఘటికాచలం‘ చిత్రాన్ని హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు దర్శకుడు అమర్ కామెపల్లి. ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ పై ప్రముఖ దర్శకుడు మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 31న ‘ఘటికాచలం‘ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ మాట్లాడుతూ “సినిమా మొదలైన పది నిమిషాల్లోనే ఆ కథలోకి వెళ్లిపోతాం. మన కళ్ల ముందే యదార్థ ఘటనలు జరుగుతున్నట్లు ఫీల్ అవుతాం. అలా చూపిస్తూనే చివరలో మంచి మెసేజ్ ఇచ్చారు.
హారర్ మూవీస్‌ను ఇష్టపడే ప్రేక్షకులు థియేటర్ లోనే ‘ఘటికాచలం‘ సినిమాను చూడండి. ఇక టికెట్ రేట్స్, పాప్ కార్న్ ధరలు..ఇలా కొన్నింటి వల్ల థియేటర్స్ కు ఆడియెన్స్ దూరమవుతున్నారు. థియేటర్స్ కు ఎక్కువమంది ఆడియెన్స్ ను తీసుకొచ్చేలా మన ఇండస్ట్రీ పెద్దలు ఆలోచనలు చేయాలి. అలా జరిగితే మిగతా అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయి”అని అన్నారు. డైరెక్టర్ అమర్ కామేపల్లి మాట్లాడుతూ “ఇది బొమ్మరిల్లు లాంటి సినిమా. అయితే ఇందులో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలుంటాయి. తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ ఆకట్టుకుంటుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో నిఖిల్ దేవాదుల, రైటర్ శ్రీనివాస్ మల్కార్, సినిమాటోగ్రాఫర్ ఎస్ఎస్ మనోజ్, షాన్ తదితరులు పాల్గొన్నారు.