Friday, May 30, 2025

గులాం నబీ ఆజాద్‌కు అస్వస్థత.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..

- Advertisement -
- Advertisement -

పహల్గంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్‌‌ను ఎండగట్టేందుకు భారత్ సిద్ధమైంది. ఈ మేరకు అన్ని పార్టీల నుంచి ఎంపిలను ఎంపిక చేసి.. విదేశీ పర్యటనకు పంపించింది. అయితే ఈ బృందం సభ్యుల్లో ఒకరైన జమ్ముకశ్మీర్ మాజీ సిఎం, డెమోక్రటిక్ ప్రోగ్రెసీవ్ ఆజాద్ పార్టీ చీఫ్, మాజీ ఎంపి గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) కూడా ఉన్నారు. అయితే ఆయన బహ్రెయిన్ పర్యటనలో అస్వస్థతకి గురయ్యారు. ఈ విషయాన్ని ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న బిజెపి ఎంపి బైజయంత్ పాండా ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

ఆజాద్ (Ghulam Nabi Azad) ప్రస్తుతం రియాజ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని.. కొన్ని టెస్టులు చేయాల్సి ఉందని తెలిపారు. సౌదీ పర్యటనలో ఉండగా.. ఆయన అనారోగ్యానికి గురి కావడం తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇప్పటివరకూ ఆయన సహకారంతో బహ్రెయిన్, కువైట్‌లో పర్యటనలు విజయవంతంగా జరిగాయని.. అల్జీరియా పర్యటనలో ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News