Sunday, July 27, 2025

కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్.. ఒకరి తర్వాత ఒకరు దాడి చేస్తూ..

- Advertisement -
- Advertisement -

దేశంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ యువతి కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్ కు గురైన దారుణ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. లోనావాలా ప్రాంతం పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తుంగౌలి ప్రాంతంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న 23 ఏళ్ల యువతిని అపహరించి కదులుతున్న కారులో ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడి చేశారు.

లోనావాలా నగర పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. 25, 35 సంవత్సరాల మధ్య వయస్సు గల ముగ్గురు వ్యక్తులు.. బాధితురాలు నడుచుకుంటూ వెళుతుండగా బలవంతంగా కారులోకి లాక్కెళ్లారు. ఆ తర్వాత కదులుతున్న కారులోనే ఆమెపై దాడి చేశారు. అంతేకాదు, పలుచోట్ల కారును ఆపి.. ఏకాంత ప్రదేశాలకు వెళ్లి ఒకరి తర్వాత ఒకరు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం మహిళను నిర్జన రహదారిపై వదిలిపెట్టి పారిపోయారు. గాయపడిన బాధితురాలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో లోనావాలా నగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 12 గంటల్లోనే నిందితులలో ఒకరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News