- Advertisement -
చెన్నై: చిన్నారి పురుగుని మింగి ఊపిరాడక మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పెరియాపాళ్యంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్కారం… తామరైపాక్కానికి చెందిన కార్తీక్ అనే రైతుకు గుగశ్రీ అనే ఏడాది పాప ఉంది. ఇంటి వద్ద ఆడుకుంటుండగా పురుగుని మింగేసింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్ చేయగా గొంతులో వస్తువు ఇరుక్కుంది అనుకున్నారు. గొంతులో నుంచి బయటకు తీయగా పురుగు అని తెలిసింది. చికిత్స తీసుకుంటూనే గుగశ్రీ చనిపోయింది. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ గ్రామ ప్రజలు విషాదంలో మునిగిపోయారు.
- Advertisement -