Thursday, July 10, 2025

స్కూల్‌లో విద్యార్థినులకు గుప్తపరీక్షలు

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. షాహాపూర్ జిల్లాలోని ఆర్‌ఎస్ దామని స్కూల్‌లో ఐదు నుంచి పది సంవత్సరాల వయస్సు ఉన్న బాలికల బట్టలు విప్పించి రుతుస్రావ పరీక్షలు నిర్వహించారు. బాత్‌రూంలలో రక్తపు మరకలు ఉండటంతో ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ విధంగా పిల్లలకు గుప్త పరీక్షలు నిర్వహించడంపై తల్లిదండ్రులు , సామాజిక వేత్తలు నిరసన తెలిపారు. యుక్తవయస్సు పిల్లలను ఎంచుకుని ఈ విధంగా శల్యపరీక్షకు దిగారని పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. తమ పిల్లలను బట్టలు తీయించి మరీ పరీక్షించారని , ఇది దారుణం అని తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. రుతుక్రమం గురించి ఈ ఈడు పిల్లలకు సరైన అవగావహన కల్పించాల్సింది

పోయి ఈ విధంగా అమానుషంగా వ్యవహరించడం తమకు బాధాకర విషయం అయిందని బాలిక తల్లి ఒక్కరు వాపోయారు. ఈ స్కూల్ ప్రిన్సిపాల్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. తమ పిల్లల పట్ల జరిగిన జుగుప్సాకర చర్య గురించి తెలియగానే తల్లిదండ్రులు మరుసటి రోజు స్కూలుకు తరలివచ్చారు. స్కూల్ సిబ్బందిని నిలదీశారు. వీరు ఇందుకు సమాధానంగా బాత్‌రూంల్లో నెత్తుటి మరకల విషయం చెప్పారని , ఇది సహజమే అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ జరిగిన ఘటనపై పలీసులు స్కూల్ ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా చేస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News