- Advertisement -
ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్‌కుమార్ తమ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్‌కు సవాలు విసిరారు. ఓట్ల చోరీ జరిగిందంటున్నారు. ఇందుకు తగు సాక్షాధారాలతో అఫిడవిట్ సమర్పిస్తారా? లేకపోతే తప్పు జరిగిందని క్షమాపణ చెపుతారా? అని ఆయన ప్రశ్నించారు. రాహుల్‌కు ఈ విషయంలో తాము 7 రోజుల గడువు ఇస్తున్నట్లు విలేకరులకు చెప్పారు. ఏదో జరిగిందని ఉత్తుతి వాదనకు దిగితే సరిపోదు. సరైన ఆధారాలు చూపకపోతే వీటిని బురదచల్లుడుగా భావించాల్సి ఉంటుంది. తప్పుడు ఆరోపణలుగా నిర్థారించుకోవల్సి వస్తుందని తెలిపారు. ఇస్తే అఫిడవిట్ లేదా సారీ అని స్పష్టం చేశారు. ఆయన తమ క్షమాపణను దేశ ప్రజలకు తెలియచేయాల్సి ఉంటుందన్నారు. ఈ రెండో మార్గాలు ఉన్నాయి. మూడో దారి లేదన్నారు. ఎన్నికల సంఘం భుజాలపై ఎక్కి రాజకీయాలు చేస్తామంటే ఎట్లా అని ప్రశ్నించారు.
- Advertisement -