- Advertisement -
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ అభిమానులకు షాకిస్తూ రిటైర్మెంట్ ప్రకటించారు. సోమవారం వన్డే క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. 2012లో ఆస్ట్రేలియా తరఫున వన్డేలో అరంగేట్రం చేసిన మాక్స్‌వెల్.. తన 13 ఏళ్ల వన్డే కెరీర్‌కు ముగింపు పలికాడు. తన వన్డే కెరీర్ లో 149 వన్డేల ఆడిన మాక్స్ వెల్.. దాదాపు 4,000 పరుగులు సాధించాడు. 2015, 2019లో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ విజయాలు సాధించడంలో గ్లెన్ మాక్స్‌వెల్ కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు ఆస్ట్రేలియా చరిత్రలో అత్యంత చిరస్మరణీయమైన వన్డే మ్యాచ్ లు ఆడాడు. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 బరిలోకి దిగిన మ్యాక్స్ వెల్.. వేలికి గాయం కారణంగా మధ్యలోనే డ్రాప్ అయ్యాడు.
- Advertisement -