Saturday, May 3, 2025

ఇంటిపై కూలిన గ్లైడర్ ప్లేన్: ఇద్దరికి గాయాలు(షాకింగ్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: వినోదం కోసం విహరించే గ్లైడర్ విమానం ఒక ఇంటిపై కూలిపోవడంతో విమానంలో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ నగరంలో శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ఎయిర్‌స్ట్రిప్ నుంచి 500 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది. బరవడ్డా ఎయిర్‌స్ట్రిప్ నుంచి బయల్దేరిన గ్లైడర్ ప్లేన్ ధనబాద్ నగరం మీదుగా చక్కర్లు కొడుతుండగా విమాంలో సాంకేతిక సమస్య తలెత్తి ఒక భవనంపై కూలిపోయింది. ఈ మొత్తం సంఘటనను విమానంలోనుంచే కెమెరాలో షూట్ చేయడం విశేషం. ఈ సంఘటనలో భవనంలో నివసించే వారెవరికీ గాయాలు కానప్పటికీ సమీపంలో ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

గ్లైడర్ విమానంలో ఒక పైలట్, ఒక 14 ఏళ్ల ప్రయాణికుడు ఉన్నారు. వారిద్దరూ తీవ్రంగా గాయపడగా వారిని అసర్ఫి ఆసుపత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భవనంపైని కాంక్రీట్ పిల్లర్‌ను ఢీకొన్న కారణంగా విమానం కాక్‌పిట్ పూర్తిగా ధ్వంసమైంది. కాగా..ప్రైవేట్ జాయ్‌రైడ్ విమానాల సురక్షితపై ఈ సంఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News