Saturday, September 6, 2025

పూర్తిగా బీస్ట్ మోడ్‌లో..

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని అద్భుతమైన సినీప్రయాణం 17 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రత్యేక సందర్భంగా తన గ్లోబల్ యాక్షనర్ ‘ది ప్యారడైజ్’ నుంచి పవర్‌ఫుల్ స్టిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ స్టిల్‌లో నాని పూర్తి బీస్ట్ మోడ్‌లో కనిపిస్తూ, ఇప్పటివరకు ఎన్నడూ చూడని ఫెరోషియస్ అవాతర్ లో ఆకట్టుకున్నారు. ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్యారడైజ్ లో నాని జడల్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నారు. ఈ క్యారెక్టర్ కోసం జిమ్‌లో జోరుగా వర్కవుట్ చేస్తున్నారని ఈ స్టిల్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన మాసీవ్ సెట్స్‌లో జరుగుతోంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ది ప్యారడైస్ 2026 మార్చి 26న థియేటర్లలోకి రానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ మొత్తం ఎనిమిది భాషల్లో విడుదల కానుంది.

Also Read : కాల్వలో తండ్రీకొడుకులు గల్లంతు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News