Wednesday, September 17, 2025

ఐటి రంగంలో భారత్ చాలా బలంగా ఉంది: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: మహిళల భద్రతలో విశాఖ అగ్రస్థానంలో ఉన్నట్లు ఇటీవల సర్వేలో తేలిందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. వివిధ వ్యాపార ఆలోచనలతో యువత ముందుకొచ్చిందని అన్నారు.  విశాఖపట్నంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్ లో సిఎం మాట్లాడారు. విశాఖలో అద్భుత వాతావరణం ఉందని, సముద్రం, అందమైన కొండలు ఉన్నాయని, అరకు కాఫీ కూడా చాలా ప్రసిద్ధి చెందిందని కొనియాడారు. 1991 లో పివి నరసింహరావు ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని, రెండో తరం సంస్కరణలను తాను తీసుకువచ్చానని చెప్పారు.

ఎపికి చెందిన ఆర్థిక మంత్రి దేశ పురోగతిలో తన వంతు పాత్ర పోషిస్తున్నారని అన్నారు. సరైన సమయంలో సరైన నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని ప్రధాని మోడీ 75 వ జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు తెలియజేశారు. ప్రధాని మోడీ దేశానికి అతి పెద్ద ఆస్తి అని ప్రశంసించారు. గత నాయుకులు టెలికామ్ రంగంలో సంస్కరణలు చేపట్టలేదని, వాజ్ పేయీ హయాంలో టెలికామ్ రంగంలో సంస్కరణలు మొదలయ్యాయని పేర్కొన్నారు. మౌలిక సౌకర్యాల రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, ఐటి రంగంలో భారత్ చాలా బలంగా ఉందని అన్నారు. గణితం, ఆంగ్లంలో ముందుండడం కలిసి వస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News