Monday, August 18, 2025

త్రివేణి సంగమం వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదావరి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/రెంజల్: రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి పరవాళ్ళు తొక్కుతూ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నది. మన రాష్ట్రంలో సంగారెడ్డి ప్రాంతంలో ఎక్కువ వర్షం కురవడంతో సింగూరు ప్రాజెక్టు నుండి దిగున ఉన్నటువంటి నిజాంసాగర్లోకి వాటర్ వదలడంతో నిజాంసాగరు నిండుకొని గేట్లు మంజీర నది ద్వారా వదలడంతో కందకుర్తిలో త్రివేణి సంగమం వద్ద గంటకు నీటి వేగం పెరుగుతున్నది. మరో పక్కన జిల్లాలు కురుస్తున్నటువంటి వర్షాలకు హరిద్ర నది ద్వారా మీరు గోదావరిలో కలుస్తున్నాయి మంజీరా హరిద్ర ద్వారా వస్తున్నటువంటి నీటి వేగం మరొక పక్కన మహారాష్ట్రలో ఎగువన ఉన్నటువంటి పలు ప్రాజెక్టుల ద్వారా వదిలినటువంటి నీటి తో నిండుగా గోదావరి ప్రవహిస్తున్నది. అల్లి సాగర్ ద్వారా రెండు గేట్లు ఎత్తివేయడంతో రెంజల్ మొండి వాగు నిండుగా ప్రవేశించి హరిద్ర ద్వారా గోదావరిలో కలుస్తున్నాయి. గోదావరి నిండుగా ప్రవహించడంతోని అటువైపు ఎవరు వెళ్ళకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి తీర ప్రతాల ఉన్నటువంటి వ్యవసాయ భూములకు పనుల కోసం ప్రజల వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. గోదావరి తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News