Wednesday, August 20, 2025

ఉప్పొంగిన గోదావరి.. నీట మునిగిన వందలాది ఎకరాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/రెంజల్ ః గోదావరి అమ్మ ఉప్పొంగింది. ఎంతలా అంటే గ్రామాలను పంట పొలాలను చుట్టేసి నీటితో కమ్మేసింది. బ్రిడ్జిపై నుండి గోదావరి అమ్మ గలగల పరవళ్ళు తొక్కింది. గతంలో ఎక్నడూ లేని విధంగా త్రివేణి సంగమం పుష్కర ఘాటు కందకుర్తి గ్రామం చుట్టూ గలగల గోదావరి కనిపించింది. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి అమ్మ ఉగ్రరూపం దాల్చింది. గత వారం రోజుల నుండి ఇటు జిల్లాల అటు మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలతో మంగళవారం ఉదయం నుండి కందకుర్తి మహారాష్ట్ర నిజామాబాద్ రహదారి అయినటువంటి గోదావరి బ్రిడ్జిపై నుండి నీళ్లు ప్రవహించాయి. గోదావరి ఒడ్డున ఉన్నటువంటి ఆశ్రమం చుట్టూ దేవాదాయ గోదావరి చుట్టూసింది. ఒక పక్కన గ్రామం చుట్టూ నీరు చేరాయి. గత నాలుగు సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న పరిస్థితి పునరుద్దమయింది.

వందలాది ఎకరాలు పంటలు నీటిలో మునిగాయి. సోయాబీన్, మక్క కూరగాయలు వరి పంట మర్చి అన్ని గోదావరి చుట్టేసింది. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పోలీసు, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తమై మహారాష్ట్ర రహదారిని రాకపోకలను బంద్ చేశారు. ఉదయం నుండే ప్రజలు గోదావరిని చూడడానికి రావడంతో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలను చేపట్టారు. గ్రామం చచుట్టూ నీరు చేరడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని గ్రామంలో హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. మహారాష్ట్రలో గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నీరు నిండుగా ప్రవహించడం మరో పక్కన మంజీరా పర్వాలు తొక్కడం త్రివేణి సంగమం వద్ద గోదావరి నిండు ప్రవహిస్తున్నది. అధికారులు గోదావరి పెరుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలన పరిశీలిస్తున్నారు. గోదావరి నిండుగా ప్రవహించడంతో ఎవరు అటూ రాకూడదని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. వివిధ పార్టీల నాయకులు పంట పొలాల్లో చేరినటువంటి నీటిని పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News