- Advertisement -
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకాని గ్రామం గోల్కొండ పోచం (64) అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తనకు ఉన్న రెండు ఎకరాలతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకకు తీసుకొని పత్తి, మిర్చి పంటలు సాగు చేస్తున్నారు. అప్పుల బాధతాళలేక పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని తెలిపారు. ఎస్ఐ శ్రీనివాస్ గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కుటుంబ సభ్యుల శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
- Advertisement -