Thursday, May 22, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధర

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయంగా పెరుగుతున్న అనిశ్చితుల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. దీంతో పసిడి ధర మరోసారి రూ.98 వేల స్థాయికి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఒక్క రోజే రూ.1,910 పెరిగి రూ.98,450కి చేరుకుంది. మంగళవారం ముగింపు ధర రూ.96,540గా ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో సాయంత్రం 7 గంటల సమయానికి 10గ్రాముల పసిడి ధర రూ.98 వేలపైనే పలుకుతోంది. అటు వెండి ధర సైతం కిలోకు రూ.99,160కి చేరుకుంది. ఒక్క రోజులోనే రూ.1660 పెరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News