Thursday, May 1, 2025

తగ్గుముఖం పట్టిన బంగారం.. ఒక్క రోజులోనే ఎంత తగ్గిందంటే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొద్దిరోజుల క్రితం రూ.లక్షకు చేరిన 10 గ్రాముల బంగారం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గురువారం ఒక్క రోజు ఏకంగా రెండు వేలకు పైనే తగ్గింది. దీంతో రూ.10 గ్రాముల పుత్తడి ధర రూ.2,180 తగ్గి రూ.95,730గా ఉంది. అంతేకాక.. గత పది రోజుల్లోనే 5వేలకు మేర పసిడి ధర తగ్గింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందానికి సంకేతాలు కనిపించడం, డాలర్ విలువ బలపడడంతో బంగారానికి గిరాకీ తగ్గి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధర కొంచెం తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం.. 3,236.94 డాలర్లగా ట్రేడవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News