- Advertisement -
పసిడి కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు రోజురోజుకు భారీగా పెరుగుతూ పరుగులు పెడుతున్నాయి. దీంతో మధ్యతరగతి, సామాన్య ప్రజలకు ఇకనుంచి అందని ద్రాక్షగా బంగారం మారిపోయింది. ఇప్పటికే రూ.లక్ష పదివేలు దాటిన బంగారం ధరలు.. మరోసారి భారీగా పెరిగాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల తులం బంగారంపై రూ.870 పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ.800 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,11,930కు చేరుకుంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,600కు పెరిగింది. అలాగే, వెండి ధర కూడా వెయ్యి రూపాయలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. లక్షా 44 వేలకు చేరుకుంది. ఇక, విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి.
- Advertisement -