Sunday, August 3, 2025

కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో: 11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గోండా జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. థోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో బొలెరో వాహనం అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో 11 మంద జలసమాధయ్యారు. సిహాగావ్ గ్రామానికి చెందిన 15 మంది భక్తులు పృథ్వీ నాథ్ ఆలయానికి బొలెరో వాహనం వెళ్తుండగా అదుపుతప్పి సరయూ నదిలో పడిపోయింది. వెంటనే స్థానికులు 15 మంది బయటకు తీశారు. 11 మంది ఘటనా స్థలంలోనే మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంపై యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ఇస్తామని సిఎం పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News