Tuesday, August 26, 2025

మన మూలాలు కలిగిన కథా కథనాలతో..

- Advertisement -
- Advertisement -

అరుణ్ రాయదుర్గం, రాణి వరదా హీరో హీరోయిన్లు గా నటిస్తున్న సినిమా ‘1990’s’. (1990’s) ఈ చిత్రాన్ని మనసు మల్లిగే బ్యానర్ పై చంద్రశేఖర్.బి.ఎస్. నిర్మిస్తున్నారు. నందకుమార్. సి.ఎం. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్‌ను డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరశంకర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వీరశంకర్ మాట్లాడుతూ “-కన్నడలో ఫేమస్ ఎడిటర్ జనార్థన్ అబ్బాయి అరుణ్ ఈ చిత్రంతో హీరోగా మన ముందుకు వస్తున్నారు. సినిమా మాత్రం మాస్‌గా చేస్తూ చివరలో పొయెటిక్ టచ్ ఇవ్వడం ట్రైలర్‌లో ఆకట్టుకుంది”అని అన్నారు.

ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ బి.ఎస్. మాట్లాడుతూ “మన మూలాలు కలిగిన కథా కథనాలతో ఈ సినిమా సాగుతుంది. తెలంగాణతో పాటు శ్రీరంగపట్నం, మైసూర్ లో షూటింగ్ (Shooting Mysore) చేశాం. మంచి కంటెంట్‌తో రూపొందిన ఈ మూవీకి అందరి ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం”అని తెలియజేశారు. డైరెక్టర్ నందకుమార్ సి.ఎం. మాట్లాడుతూ సినిమా కొత్త తరహాలో సాగుతూ అందరినీ మెప్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ జర్నలిస్ట్‌లు వినాయకరావు, ప్రభు, సురేష్ కొండేటి, హీరో అరుణ్ రాయదుర్గం, హీరోయిన్ రాణి వరదా, ఇ.సి.మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News