హీరో నారా రోహిత్ మైల్ స్టోన్ 20వ మూవీ ‘సుందరకాండ’. (Sundarakanda) నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీ దేవి విజయ్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “చాలా కొత్త పాయింట్‌తో వస్తున్న సినిమా ఇది. -డైరెక్టర్ సుందరకాండ కథ చెప్పగానే షాక్ అయ్యాను.
చాలా కొత్త స్క్రిప్ట్. డైరెక్టర్ చెప్పినట్టే అద్భుతంగా తీశారు. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి ఎంటర్‌టైనర్ ఇది. -నా క్యారెక్టర్‌లో చాలా డిఫరెంట్ ఎమోషన్స్ (Different emotions) ఉన్నాయి. చాలా బలమైన పాత్ర చేశాను. – ఇందులో స్కూల్ డ్రెస్ వేసుకునే అవకాశం వచ్చింది. అది మరచిపోలేని అనుభూతినిచ్చింది. హీరో నారా రోహిత్‌తో వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. డైరెక్టర్ -వెంకీకి ఇది మొదటి సినిమా. కానీ చాలా అనుభవం ఉన్న డైరెక్టర్ లాగా తీశారు. -ఈ సినిమాకు లియోన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు”అని అన్నారు.