సమాజానికి అవసరమైన సందేశాన్ని అందిస్తూ రమేష్ ఉప్పు హీరోగా, లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వీడే మన వారసుడు’. ( veede mana vaarasudu) రమేష్ ఉప్పు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం జూలై 18న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నట్టు చిత్ర దర్శక నిర్మాత రమేష్ ఉప్పు పేర్కొన్నారు.
ఆయన మాట్లాడుతూ “సమాజానికి మంచి సందేశం అందిస్తుంది మా సినిమా. ఇందులోని భావోద్వేగా లు ప్రతి ఒక్కరిని కదలిస్తాయి. రైతుల కష్టాలను ( hardships farmers) అర్థవంతంగా ఆవిష్కరించిన కుటుంబ కథా చిత్రమిది”అని చెప్పారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే, మల్ రెడ్డి రంగారెడ్డి, సురేందర్ రెడ్డి, రామావత్ తేజ, సముద్ర, వీఎన్ ఆదిత్య, 30 ఇయర్స్ పృథ్వి, కృష్ణసాయి, దిల్ రమేష్ జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ నవీన్, నాగ మహేష్, సాయి వెంకట్, లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ తదితరులు పాల్గొన్నారు.