- Advertisement -
నటకిరీటి డా: రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషించిన ‘నేనెవరు?’ చిత్రం దసరా విడుదలకు సిద్ధమవుతోంది. సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్యపాత్రల్లో చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో సందేశ భరిత వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జై చిరంజీవ మూవీ మేకర్స్ పతాకం పై సరికొండ మల్లిఖార్జున్ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు, – సకినాన భూలక్ష్మి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఆడియో, టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు. – మాజీ శాసనసభ్యులు – తీగల కృష్ణారెడ్డి, దర్శకులు వి.సముద్ర ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుకలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తాను నటించిన మంచి సినిమాల్లో ఒకటిగా ‘నేనెవరు?’ చిత్రం నిలిచిపోతుందని అన్నారు.
Also Read : అందెల రవమిది’ వచ్చేస్తోంది
- Advertisement -