ముంబై: బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.! అక్టోబర్ 4 నుంచి బ్యాంక్‌లో మనం చెక్కు సమర్పించిన కొద్ది గంటల్లోనే, బ్యాంక్‌లు చెక్కులను క్లియర్ చేస్తా యి. రిజర్వ్ బ్యాంక్ ఈ కొత్త విధానాన్ని అక్టోబర్ 4వ తేదీనుంచి ప్రవేశపెడుతోంది. దీని వల్ల చెక్కు సమర్పించిన కొద్ది గంటల్లోనే నగదు తీసుకునే సౌక ర్యం లభిస్తుంది. దీని వల్ల రెండు రోజుల సమయం కలిసివస్తుంది. బ్యాంక్‌లో చెక్కులను స్కాన్ చేసి, స మర్పించిన కొద్ది గంటల్లో, వ్యాపార సమయం ముగిసేలోగానే క్లియర్ చేస్తారు. ప్రస్తు తం చెక్ ట్రం కేషన్ సిష్టమ్ (సిడిఎస్) రెండు పని దినాల వరకూ క్రియరెన్స్ ప్రక్రియ పూర్తి చేస్తున్నది. చెక్ క్లియరింగ్ సామర్థ్యం మెరుగు పడడం వల్ల ఇక ముందు లావాదేవీలు మరింత వేగవంతం అవుతాయి. బ్యాంక్ ఖాతా దారుల కు మెరుగైన సౌకర్యం కల్పించేందుకు, సెటిల్మెంట్ ప్రమాదాన్ని
తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుతం బ్యాచ్ ప్రాసెసింగ్ విధానం నుంచి ఆన్ – రియలైజేషన్ – సెటిల్మెంట్‌తో నిరంతరక్లియరింగ్‌కు సిటిఎస్ ని మార్చాలని నిర్ణయించింది. సీటీఎస్ లో నిరంతర క్లియరింగ్ , సెటిల్మెంట్ ఆన్ రియలైజేషన్ ను ప్రవేశపెట్టేందుకు సంబంధించి రిజర్వు బ్యాంక్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. రెండు దశలలో ఈ ప్రక్రి య అమలు జరుగుతుంది. తొలి దశ 2025 అక్టోబర్ 4 నుంచి మొదలు కాగా, రెండో దశ 2026 జనవరి 3వ తేదీ నుంచి అమలవుతుందని ఆర్ బిఐ సర్క్యులర్ లో పేర్కొంది. బ్యాంక్‌లలో ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 4 గంటలవరకూ ఒకే ప్రెజెంటేషన్ సెషన్ ఉంటుంది. ప్రజెంటేషన్ సెషన్ సమయంలో శాఖల ద్వారా స్వీకరించిన చెక్కులను బ్యాంక్ లు స్కాన్ చేసి, క్లియరెన్స్ హౌస్ కు వెంటనే, నిరంతరం పంపుతాయని ఆర్ బిఐ తెలిపింది.