- Advertisement -
రాష్ట్రంలో మిర్చి రైతులకు మేలు చేకూర్చేలా మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం(ఎంఐఎస్) కింద మార్కెట్ ధరకు, సాగు ఖర్చుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని రైతులకు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో మిర్చిరైతులు దళారీల వల్ల పోసపోతున్న తీరుపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ ఏప్రిల్ 4వ తేదీన రాసిన లేఖకు సానుకూలంగా స్పందించినట్లు ఆయన వెల్లడించారు. ఎంఐఎస్ కింద మిర్చి క్వింటాల్ ధర రూ,10,374లు నిర్ణయించారని, ఇందు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి యాబై శాతం నిధులను పంచుకుంటాయని తెలిపారు. బహిరంగ మార్కెట్లో దళారీల వల్లమిర్చి రైతులు మోసపోకుండా వారికి మద్దతుగా నిలిచేందుకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో మార్కెట్ ఇంటర్వన్షన్ స్కీమ్‌ను తీసుకువచ్చినట్లు మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
- Advertisement -