Wednesday, May 21, 2025

మెట్రో ప్రయాణికులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పెంచిన మెట్రో రైలు ఛార్జీలను సవరించి ఛార్జీలను 10 శాతం తగ్గిస్తూ మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గిన మెట్రో ఛార్జీలు మే 24 నుంచి వర్తించనున్నాయని ప్రకటన విడుదల చేసింది. వారం రోజుల క్రితం మెట్రో ఛార్జీలను పెంచుతూ హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ పెంచిన ఛార్జీలు ఈ నెల 17 నుంచి అమల్లోకి వచ్చాయి. గతంలో ఉన్న టికెట్ ధరకు కనిష్ఠంగా రూ.10 నుంచి రూ.12, గరిష్ఠ టికెట్ ధర రూ.60 నుంచి రూ.75గా సవరించారు. ఈ ఛార్జీలను కిలోమీటర్ల వారీగా పెంచారు. మెట్రో ఛార్జీలు పెంచినప్పటి నుంచి ప్రయాణికులు, విపక్షాల నుంచి చార్జీలు తగ్గించాలని డిమాండ్‌లు వచ్చాయి. దీంతో పెంచిన ఛార్జీలను 10 శాతం తగ్గిస్తూ మెట్రో యాజమాన్యం తాజాగా నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News