Tuesday, September 2, 2025

రైతులకు శుభవార్త.. రాష్ట్రానికి భారీగా యూరియా సరఫరా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా యూరియా (Urea) అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్న విషయం తెలిసిందే. యూరియా కేంద్రాల వద్ద రైతులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. రైతుల కష్టాలను ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో రైతులకు ఎట్టకేలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రానికి భారీగా యూరియా వచ్చినట్లు వెల్లడించింది.

సోమవారం 9వేల టన్నుల యూరియా (Urea) సరఫరా జరిగింది. ఈ రోజు (మంగళవారం) రాత్రి లోపు మరో 5వేల టన్నుల యూరియా రానున్నట్లు తెలిసింది. మరో వారం రోజుల్లో రాష్ట్రానికి 27,470 టన్నుల యూరియా రానుంది. ఈ విషయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఇబ్బందులు రాకుండా యూరియా సరఫరా చేయాలని అన్నారు. వరదల వల్ల కలిగిన పంటనష్టంపై సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. 5 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని పేర్కొన్నారు.

Also Read : వర్షం మిగిల్చిన విధ్వంసం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News