Sunday, July 13, 2025

తిరువల్లూరులో గూడ్సు రైలులో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డీజిల్ తరలిస్తున్న గూడ్సు రైలులో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్తగా విద్యుత్‌ సరఫరాను రైల్వే అధికారులు నిలిపివేశారు. రైలు చెన్నై నుంచి బెంగళూరుకు ఇండియన్ ఆయిల్ తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరో ఐదు వ్యాగన్లకు కూడా మంటలు వ్యాపించాయి. మొత్త 52 వ్యాగన్లతో గూడ్సు రైలు వెళ్తుండగా మంటలు అంటుకున్నాయి. చెన్నై- ఆరక్కోణం మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రైళ్లను రైల్వేశాఖ దారి మళ్లిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News