టాలీవుడల్ లో నందమూరి బాలకృష్ణ హవా మామూలుగా లేదు. ఈ వయసులోనూ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ లు కొడుతూ బాలయ్య జోరు చూపిస్తున్నాడు. ఇటీవల బాబీ కొల్లు దర్శకత్వంలో బాలయ్య నటించిన డాకూ మాహారాజ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ తర్వాత మరోసారి మాస్ సినిమాతో రానున్నారు. డైరెక్టర్ గోపిచంద్ మలినేని బాలయ్యతో రెండో సినిమాను ప్రకటించారు. వీరి కాంబోలో వీర సింహారెడ్డి వచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా బాలయ్యతో సెకండ్ మూవీ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు గోపిచంద్. ప్రస్తుతం జాట్ మూవీ ప్రమోషన్ లో ఉన్న ఆయన మాట్లాడుతూ.. బాలకృష్ణతో మరో సినిమా చేయబోతున్నానని. జూన్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఈ మూవీ పూర్తైన తర్వాత ‘జాట్ 2’ చేయనున్నట్లు తెలిపారు. సెకండ్ పార్ట్.. మొదటి పార్ట్ కంటే మించి ఉంటుందని చెప్పారు. బాలీవుడ్ హీరో సన్నీ దేవోల్ హీరోగా తెరకెక్కిన ‘జాట్’ ఈ నెల 10న థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.