- Advertisement -
ముంబయి: 63 ఏళ్ల ప్రియురాలిని చంపి అనంతరం మృతదేహాన్ని బెడ్ లో కుక్కేసి ప్రియుడు పారిపోయాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని గుర్‌గామ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గురుగామ్ లో రాగిణి సవర్‌దేకర్(63) అనే వృద్ధురాలు ప్రతాప్ బస్కోటి(65) అనే వృద్ధుడితో సహజీవనం చేస్తోంది. బుధవారం పొరుగింటి వ్యక్తి సవర్‌దేకర్ బంధువుకు ఫోన్ చేసి ఇంటి తాళం తీసుకోవాలని సూచించాడు. సోమవారం సవర్‌దేకర్, రాగిణిలు సౌత్ ముంబయికి వెళ్లారని బంధువులకు చెప్పారు. పక్కింటి వారికి అనుమానం రావడంతో బంధువులతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని బలవంతంగా డోర్ ఓపెన్ చేసి ఇల్లును పరిశీలించారు. బెడ్ లోపల వృద్ధురాలి మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
- Advertisement -