Wednesday, July 23, 2025

రీకాల్ మేనిఫెస్టో అంటూ అసత్యాలతో తిరిగేవారిని తరిమికొట్టాలి: గొట్టిపాటి

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైసిపి పార్టీ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నిలదీయాలని ఎపి మంత్రి గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravikumar) తెలిపారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం వెంపరాలలో గొట్టిపాటి పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా ఇంటింటికి వెళ్లారు. రూ. 5 కోట్ల నాబార్డ్ నిధులతో(Rs.5 crore NABARD funds) నిర్మించిన రహదారికి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రీకాల్ మేనిఫెస్టో అంటూ అసత్యాలతో తిరిగేవారిని తరిమికొట్టాలి అని అన్నారు. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News